telugu navyamedia
తెలంగాణ వార్తలు

రేవంత్ రెడ్డిపై పరువునష్టం దావా వేసిన కేటీఆర్

మంత్రి కేటీఆర్‌, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం మరింత ముదిరింది. తనపై అసత్య ప్రచారం జరుగుతుందంటూ.. పరువు నష్టం దావా వేశారు మంత్రి కేటీ రామారావు. ‘‘ఉద్దేశపూర్వకంగా నాపై వదంతులు, అబద్ధాలను ప్రచారం చేస్తున్నార‌ని మరోసారి తీవ్రంగా స్పందించారు.

అలాగే.. దుష్ప్రచారం చేసిన వారిపై కోర్టు న్యాయపరమైన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నా..నేరస్థులకు తగిన శిక్ష పడాలి’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. రేవంత్ రేడ్డి చేస్తున్న ఆరోపణలు.. అబద్దాలని కోర్టులో రుజువు అవుతుందన్న నమ్మకం ఉంది.’’అన్నారు.

కాగా..డ్రగ్స్​ పరీక్షల కోసం రేవంత్​ విసిరిన వైట్​ ఛాలెంజ్​పై స్పందించిన కేటీఆర్​… ‘‘ఎలాంటి పరీక్షలకైనా సిద్ధంగా ఉన్నా. కాంగ్రెస్‌ తరఫున రాహుల్‌ గాంధీ సిద్ధమేనా?” అని ప్రశ్నించారు. రాహుల్ఒప్పుకుంటే దిల్లీ ఎయిమ్స్‌లో పరీక్షలకు సిద్ధమని ప్రకటించారు.

చర్లపల్లి జైలుకు వెళ్లొచ్చిన వారితో తన స్థాయి కాదని, క్లీన్‌చిట్‌ వస్తే రేవంత్‌ క్షమాపణ చెప్పి పదవులు వదులుకుంటారా? ఓటుకు నోటు కేసులో లైడిటెక్టర్‌ పరీక్షలకు సిద్ధమా’’ అని కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా సవాల్‌ విసిరారు. తనపై అనేక ఆరోపణలు చేస్తూ రేవంత్ రెడ్డి మాట్లాడారు. .వీటికి స్పందిస్తూ ఈ నేపథ్యంలో తాజాగా కేటీఆర్‌ చట్టపరమైన చర్యలకు సిద్ధం అయ్యారు.

Related posts