నేపాల్ దేశం ఖాట్మండ్‌లో నాలుగు రోజుల పాటు జరిగిన ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొన్న పాతనగరం అలియాబాద్‌కు చెందిన ఎం.ప్రవీణ్ కుమార్ సత్తా చాటాడు. సీనియర్ పురుషుల కేటగిరి -68 కేజీల విభాగంలో ప్రవీణ్ కుమార్ సిల్వర్ మెడల్‌ను కైవసం చేసుకున్నాడు.
2018లో రష్యాలో జరిగిన కిక్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొని ప్రవీణ్‌కుమార్ బంగారు పతకాన్ని సాధించాడు. విదేశాల్లో జరిగే కిక్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గర్వించేలా ప్రవీణ్‌కుమార్ విజయాలను సాధిస్తున్నాడని కోచ్ మహిపాల్ తెలిపారు.
రాజకీయాలంటే అసహ్యం… సంచలనం సృష్టిస్తున్న హాలీవుడ్ నట దిగ్గజం వ్యాఖ్యలు