telangana-intermediate-supply-results

తెలంగాణ ఇంటర్‌ మీడియట్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు…

27

తెలంగాణ ఇంటర్‌ మీడియట్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను ఈ రోజు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి’ రంజీవ్‌ ఆచార్య’ ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. 1,45,522ల మంది విద్యార్థులు మొదటి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు రాశారు.

ఇందులో 44 వేల 817 విద్యార్థులు పాస్‌ అయ్యారు. ఈ పరీక్షలలో ఉత్తీర్ణత 31.9 శాతంగా ఉంది. మొత్తం మొదటి సంవత్సరం ఉత్తీర్ణత 72.20 శాతంగా ఉంది. ద్వితీయ సంవత్సరం కు 84 వేల 449 మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాశారు. అందులో 49 వేల 358 మంది పాస్‌ అయ్యారు.

మొత్తం ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణత శాతం 78.70 శాతంగా ఉంది. జూన్‌ 16 వరకు మెమోలు సంబంధిత కాలేజ్‌ కి పంపిస్తామని అధికారులు తెలిపారు. జూన్‌ 18 వరకు రివాల్యుయేషన్‌, రికౌంటింగ్‌ కి దరఖాస్తు చేసుకోవచ్చు అన్ని అధికారులు తెలిపారు.

ఫలితాల కోసం డౌన్లోడ్ పై క్లిక్ చెయ్యండి
డౌన్లోడ్