telugu navyamedia
విద్యా వార్తలు

తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..

తెలంగాణ ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ మంగళవారం ఫలితాలను విడుదల చేశారు. 

ఈ అడ్వాన్స్ సప్లిమంటరీ పరీక్షలకు మొత్తం 1,14,289 మంది హాజరుకాగా, సప్లిమెంటరీ జనరల్ పాస్ పర్సంటేజ్ 47.74%గా ఉండగా ఒకేషనల్‌ 65.07% ఉత్తీర్ణత సాధించారని ఆయన పేర్కొన్నారు. ఫలితాల కోసం బోర్డు వెబ్ సైట్ https://tsbie.cgg.gov.in/ ను చూడాలని విద్యార్ధులకు సూచించారు.

ఈ ఏడాది మే నెలలో ఇంటర్మీడియెట్‌ రెగ్యులర్‌ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు.ఈ పరీక్షకు దాదాపు 1.13లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఎంసెట్ కౌన్సిలింగ్ ఉన్నందున విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు కేవలం సీనియర్ సప్లిమెంటరీ మాత్రమే విడుదల చేసినట్లు బోర్డు కమిషనర్ పేర్కొన్నారు.

 

Related posts