telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆ వ్యవహారంలో తప్పించుకోలేవు.. కేటీఆర్‌ కు రేవంత్ వార్నింగ్ 

KTR_Revanth
తెలంగాణ ఇంటర్ ఫలితాల గందరగోళం పై  కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే గ్లోబరీనాకు ఇంటర్ పరీక్షల నిర్వహణ కాంట్రాక్టును కట్టబెట్టారని రేవంత్ ఆరోపించారు.గ్లోబరీనా సంస్ధతో సంబంధాలు లేవని చెప్పినంత మాత్రాన తప్పించుకోలేవని కేటీఆర్ హెచ్చరించారు. 
గతంలో పరీక్షల నిర్వహణ పారదర్శకంగా ఉండేందుకు హాల్ టికెట్ల జారీ, జవాబు పత్రాల వాల్యుయేషన్, ఫలితాల ప్రకటనను మూడు దశలుగా విభజించి ఒక్కో దశను ఒక్కో సంస్థకు అప్పజెప్పేవారన్నారు.సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌ను కాదని అర్హత లేని గ్లోబరీనా కాంట్రాక్టు ఇచ్చారని రేవంత్ ఆరోపించారు. ప్రభుత్వ సంస్థను కాదని ప్రైవేట్ సంస్థలకు టెండర్లు ఎలా వెళ్లాయని ప్రశ్నించారు. 
ఇప్పుడేమో గ్లోబరీనా సంస్థ తనకు తెలియదంటూ కేటీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇంటర్ పరీక్షలను సీజీసీ నిర్వహించినప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాలేదని రేవంత్ గుర్తు చేశారు. ఎంసెట్-2 స్కాంకు పాల్పడిన మ్యాగ్నటిక్ ఇన్ఫోటెక్, గ్లోబరీనా ఒక్కటేనని రేవంత్ ఆరోపించారు. 2016లో తెలంగాణ ఎంసెట్ లీకేజీ వెనక మ్యాగ్నటిక్ ఇన్ఫోటెక్ ప్రధాన పాత్ర పోషించిందన్నారు. ఆ సంస్ధ డైరెక్టర్ విజయరామారావు అల్లుడు ప్రద్యుమ్న కేటీఆర్ క్లాస్‌మేట్ ‌అని రేవంత్ ఆరోపించారు.

Related posts