telangana icet results

తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల…

85

హైదరాబాద్, తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల చేశారు ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి. ఐసెట్ కు 55,191 మంది విద్యార్థులు హాజరవగా అందులో అర్హత సాధించిన వారు 49, 812 మంది విద్యార్థులు. ఈ సంవత్సరం ఉత్తీర్ణతా శాతం 90.25గా ఉంది.

హైదరాబాద్ కు చెందిన సత్య ఆదిత్య తాటి మొదటి ర్యాంకును 164.28 మార్కులతో సాధించారు. ఇక బాలికలలో లక్ష్మి స్రవంతి 161.25 మార్కులు తెచ్చుకొని ప్రధమంగా నిలిచింది. వై.సాయి సందీప్ మరియు జి.నవీన్ కుమార్ రాష్ట్రంలో రెండవ మరియు మూడవ స్థానాలను కైవసం చేసుకున్నారు.

ఈ ఫలితాలను నేటి మధ్యాహ్నం నుండి అధికారిక వెబ్ సైట్ : icet.tsche.ac.in లో చూసుకోవచ్చు.

ఈ సంవత్సరం కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ ఐసెట్ ను నిర్వహించింది. దాదాపు 60 పరీక్షా కేంద్రాలలో మే 23, 24న తెలంగాణ ఐసెట్ నిర్వహించారు. జులై మొదటి వారం నుండి కౌన్సెలింగ్ జరుగుతుందని అధికారి వెల్లడించారు.