telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఓయూలో రాహుల్ ప‌ర్య‌ట‌న‌కు కోర్టు గ్రీన్ సిగ్న‌ల్‌

*ఓయూలో రాహుల్ ప‌ర్య‌ట‌న‌కు అనుమ‌తించాల‌ని వీసికి హైకోర్టు ఆదేశం
*ఓయూలో విద్యార్ధ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకే రాహుల్ వెళ్తున్నార‌ని కోర్టుకు తెలిపిన పిటిష‌న‌ర్‌
*రాహుల్‌తో పాటు కాంగ్రెస్ నేత‌ల‌కు అనుమ‌తిచ్చిన కోర్టు..

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటనకు తెలంగాణ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రెండు రోజుల పాటు ఆయన రాష్ట్రంలో పర్యటించనుండగా.. ఈ నెల 7వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో  రాహుల్ గాంధీతో సమావేశం పెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత కాంగ్రెస్ నేతలు ఓయూ వీసీకి దరఖాస్తు చేసుకున్నారు.

అయితే రాహుల్ గాంధీ పర్యటనకు రెండు సార్లు వీసీ అనుమతి నిరాకరించడంతో మరోసారి హైకోర్టులో కాంగ్రెస్ నేతలు పిటిషన్ వేశారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికే రాహుల్ విద్యార్థులతో భేటీ అవుతున్నారని పిటిషనర్ తరపు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. గతంలో అనేక మంది రాజకీయ నేతలు ఓయూలో ప‌ర్య‌టించారని, ఇప్పుడు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదో తెలపాలని పిటీషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు..

ఈ అంశంలో ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు.. ఓయూలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతించాలని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌ను ఆదేశించింది.విద్యార్థులతో ముఖుముఖికి అనుమతించిన హైకోర్టు.. 150 మందితో మాత్రమే అనుమతించాలని వీసీకి ఆదేశాలు జారీ చేసింది.

 

Related posts