telugu navyamedia
తెలంగాణ వార్తలు

జూబ్లీహీల్స్ హ‌త్యాచార ఘ‌ట‌న‌పై స్పందించిన గ‌వ‌ర్న‌ర్ త‌మిళసై..

జూబ్లీహిల్స్ లో బాలిక సామూహిక అత్యాచార ఘటనలో తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరా రాజన్‌ స్పందించారు. ఈ ఘటనపై త‌క్ష‌ణ‌మే నివేదిక అంచాలని సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ..రెండు రోజుల్లోగా పూర్తి నివేదికను అందించాలని ఆదేశించారు.

అత్యాచార ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన గవర్నర్.. మీడియాలో వస్తున్న కథనాలను నిశితంగా పరిశీలించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమంటూ తమిళిసై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

మే 28వ తేదీన అమ్నేషియా పబ్ లో పార్టీ చేసుకున్న విద్యార్ధులు సాయంత్రం ఐదు గంటలకు పబ్ నుండి బయటకు వెళ్లిపోయారు. అయితే పబ్ లోనే ఓ మైన‌ర్ బాలిక‌ ను ట్రాప్ చేసిన ఆరుగురు యువకులు కారులో తీసుకెళ్లారు. ఆ తర్వాత కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టుగా బాలిక పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో పేర్కొంది.ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనపై ఇప్పటికే ప్రతిపక్షాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ కాంగ్రెస్ శ్రేణులు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించాయి. ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ బీజేపీ నేతలు డీజీపీని కలిసి వినతిపత్రం సమర్పించారు.

Related posts