telugu navyamedia
తెలంగాణ వార్తలు

రక్తదానం చేయడం చిన్నవిషయం కాదు ..చిరంజీవి రియల్ మెగాస్టార్‌

మెగాస్టార్‌ చిరంజీవి తెలంగాణ రాజ్ భవన్ కు వెళ్లారు. చిరంజీవి బ్లడ్ బ్యాంకు ద్వారా 50 సార్ల కంటే ఎక్కువ సార్లు రక్త దానం చేసిన వారికి ‘చిరు భద్రత’ పేరుతో గవర్నర్ చేతుల మీదుగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్డులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. బ్లడ్ బ్యాంకు ద్వారా సేవ చేస్తున్న చిరంజీవికి అభినందనలు తెలిపారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎన్నో జీవితాలు నిలబడ్డాయని, ఆయన రియల్ మెగాస్టార్‌ అని కొనియాడారు. ప్రతి రక్త దాత ఒక స్టార్ అని తమిళి సై వ్యాఖ్యానించారు.

రక్తదానం చేయడం చిన్నవిషయం కాదని అన్నారు. తాను హౌస్‌ సర్జన్‌గా పనిచేస్తున్న సమయంలో రక్తం ఇచ్చేందుకు సొంత కుటుంబ సభ్యులు కూడా వెనకడుగు వేసేవారని గుర్తు చేసుకున్నారు

రక్తదానం వల్ల ఇబ్బంది లేదని చెప్పినా వాళ్లు పట్టించుకోలేదన్నారు. రక్తం దొరకక పలువురు చనిపోయిన విషయాన్ని తాను డాక్టర్ గా ఉన్న సమయంలో గుర్తించినట్టుగా తమిళిసై సౌందర రాజన్ ప్రస్తావించారు

రక్తదానం చేసిన వారిలో ఎప్పటికప్పుడు కొత్త రక్తం వస్తుందని అన్నారు. తెలంగాణ రాజ్‌భవన్‌ తరఫున కూడా వివిధ సందర్భాల్లో రక్తదాన శిబిరాలు చేపడుతున్నామని అన్నారు.

అవసరమైన వారికి సమయానికి రక్తం అందించేందుకు ఓ యాప్‌ను రూపొందించామని కూడా తెలిపారు. చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌ కూడా అందులో భాగం కావాలని తమిళిసై సౌందరరాజన్ చిరంజీవిని కోరారు.

 

Related posts