telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు పొడిగింపు

తెలంగాణ విద్యాసంస్థలకు సెలవులను పొడగించారు. కరోనా దృష్ట్యా విద్యాసంస్థలకు సెలవులను పొడగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖ సూచనలపై సీఎం కేసీఆర్‌తో చర్చించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చారు.  ఈనెల 30వ తేదీ వరకు సెలవులు పొడిగించినట్లు తెలిపారు. 

కాగా జనవరి తొలి వారంలోనే కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో సంక్రాంతి సెల‌వులు జనవరి 8 నుంచి 16 వరకు ప్రకటించింది. ఈ సెలవులు నేటితో ముగియనున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో నెలాఖరు వరకు సెలవులు పొడిగించాలని కేసీఆర్‌ సర్కార్‌ నిర్ణ‌యం తీసుకుంది. అన్ని విద్యాసంస్థలకు ఈ సెలవులు వర్తిస్తాయని స్పష్టత ఇచ్చింది సర్కార్‌.

ఈ నేపథ్యంలో విద్యార్థులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆన్ లైన్ క్లాసుల నిర్వహణకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో మరోసారి ఆన్ లైన్ క్లాసులు నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ప్రైవేటు విద్యాసంస్థలు కోరినట్లు ప్ర‌భుత్వానికి కోరిన‌ట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఆన్ లైన్ క్లాసులు ఉంటాయని విద్యార్థులకు సందేశాలు పంపినట్లు తెలుస్తోంది. అయితే ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణపై ఇంకా ప్రభుత్వం అధికారికంగా గైడ్‌ లైన్‌ ఇవ్వలేదు. కేవలం సెలవులను మాత్రమే ఈనెల 30 వరకు పొడగిస్తున్నట్లు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 15-18 ఏళ్ల విద్యార్థులకు వ్యాక్సిన్‌ వేయించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Related posts