telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ ఉద్యోగులకు కొత్త మార్గదర్శకాలు!

sankranthi holidays in telangana

తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఉద్యోగులకు ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలు జారీచేసింది. సచివాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలను దృష్టిలో ఉంచుకుని నూతన నిబంధనావళి రూపొందించారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఇకపై ప్రభుత్వ కార్యాలయాల్లో 50 శాతం సిబ్బంది హాజరు కావాలి. 50 శాతం సిబ్బంది రొటేషన్ విధానంలో పనిచేయాలి. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు జూన్ 22 నుంచి జూలై 4 వరకు అమల్లో ఉంటాయని తెలిపారు

గర్భవతులు, వివిధ వ్యాధులతో బాధపడేవారు సెలవులను వాడుకోవాలి.ఆఫీసుల్లో ప్రత్యేకంగా చాంబర్లు ఉన్నవారు ప్రతిరోజూ ఆఫీసుకు రావాల్సి ఉంటుంది. ఉన్నతాధికారుల అనుమతి ఉంటే తప్ప సందర్శకులను ఆఫీసుల్లోకి అనుమతించరాదు. అధికారులు ఉపయోగించే వాహనాల డ్రైవర్లు పార్కింగ్ లో కాకుండా ఇకపై పేషీలో ఉండాలి. సచివాలయంలోని నాలుగో తరగతి ఉద్యోగులు వారం విడిచి వారం విధులకు హాజరు కావాల్సి ఉంటుందిని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

Related posts