telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణ కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే..?

corona

తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.7 లక్షలు దాటాయి కరోనా కేసులు. అయితే… ఇవాళ రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం..అయితే తాజా బులెటిన్ ప్రకారం కొత్తగా రాష్ట్రంలో 573 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,77,724 చేరింది. ఇందులో 2,68,601 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 7,630 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. తాజా బులెటిన్ ప్రకారం తాజాగా కరోనాతో నలుగురు మృతి చెందారు. దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1493కి చేరింది. దేశవ్యాప్తంగా కరోనా మరణాల రేటు 1.5 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.53 శాతానికి పడిపోయిందని.. రికవరీ రేటు దేశంలో 94.9 శాతంగా ఉంటే.. స్టేట్‌లో 96.69 శాతానికి పెరిగిందని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇక తాజా బులెటిన్ ప్రకారం నిన్న ఒక్కరోజు 609 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. నిన్న తెలంగాణాలో 47,186 పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 61,28,703 పరీక్షలు జరిగాయి.

Related posts