telugu navyamedia
తెలంగాణ వార్తలు

దేశంలో సెన్సేషన్‌ జరగాలి.. అది జరిగి తీరుతుంది..

ఇద్దరు వ్యాపార వేత్తలు కలిస్తే బిజినెస్​ గురించే మాట్లాడుకుంటారని అలాగే ఇద్దరు రాజకీయ నేతలు కలిస్తే రాజకీయాలే మాట్లాడుతారని ..దేశంలో సెన్సేషన్‌ జరగాలి.. అది జరిగి తీరుతుందని , రాబోయే రోజుల్లో మీరే చూస్తార‌ని తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

శనివారం సాయంత్రం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాతో కలిసి సర్వోదయ పాఠశాలను సీఎం కేసీఆర్‌ సందర్శించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి ఢిల్లీ లోని మోతీబాగ్‌లో ఉన్న సర్వోదయ ప్రభుత్వ పాఠశాలను కేసీఆర్​ పరిశీలించారు. 

అనంతరం అక్కడి సిబ్బంది పాఠశాల ప్రత్యేకతలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్య, సదుపాయాలను కేసీఆర్‌కు వివరించారు.పాఠశాలలో అధునాతనంగా అందుతున్న వసతుల గురించి ఆరా తీశారు.

ప్రభుత్వ పాఠశాలల్లో వసతులకు సంబంధించిన వీడియోలను కేసీఆర్​ బృందం వీక్షించిన కేసీఆర్​.​.. విద్య విషయంలో ఢిల్లీ ప్రభుత్వం కృషి అభినందనీయం కొనియాడారు.. దేశంలో ఎక్కడా ఇలాంటి విధానం లేదని అన్నారు. విద్యార్థులను జాబ్‌ ప్రొవైడర్లుగా మార్చుతున్నారు.

ఢిల్లీ ప్రభుత్వ స్కూళ్లలో విద్యావిధానం గురించి తెలుసుకొనేందుకు.. తెలంగాణ టీచ‌ర్స్‌కు, అధికాలరుల‌కు ఢిల్లీకి పంపిస్తామ‌ని అన్నారు. తెలంగాణ‌లో కూడా విద్యా విధానాన్ని మారుస్తామ‌ని అన్నారు.

కేంద్రం తీసుకొస్తున్నకొత్త విద్యావిధానం ఏకపక్షంగా ఉంది. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు సీఎం కేసీఆర్‌.

Related posts