“తేజ్ ఐ లవ్ యూ” కాంటెస్ట్ అలెర్ట్…!?

25

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్న చిత్రం ‘తేజ్‌’. ఐ లవ్‌ యు అనేది ఉపశీర్షిక.

సంగీత ద‌ర్శ‌కుడు గోపీసుంద‌ర్ సంగీత సార‌థ్యంలో ఈ సినిమా పాట‌లు విడుద‌ల కానున్నాయి. జూన్ 9న సాయంత్రం 6 గంటలకు హైద‌రాబాద్ జె.ఆర్‌.సి.క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో జ‌ర‌గ‌బోతున్నఈ ఆడియో ఫంక్ష‌న్‌కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఇక ఈ సందర్భంగా “తేజ్ ఐ లవ్ యూ” టీం ఒక కాంటెస్ట్ ను ప్రకటించింది. అదేంటంటే “తేజ్ ఐ లవ్ యూ” చిత్ర బృందం అడిగిన నాలుగు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. ఈ సమాధానాల్ని ట్విట్టర్ లో #TejILoveYouFanContest అనే యాష్ ట్యాగ్ తో పోస్ట్ చెయ్యాలి. సరైన సమాధానాలు చెప్పిన వారికి “తేజ్ ఐ లవ్ యూ” చిత్రబృందంతో కలిసి సెల్ఫీ తీసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు రేపు హైదరాబాద్ లో జరిగే ఆడియో వేడుకకు పాసులు కూడా గెలుచుకోవచ్చు. ఈ మేరకు ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చెయ్యండి…!

tej-i-love-u
ఈ నేపథ్యంలోనే అనుపమ పరమేశ్వరన్ కూడా రేడియో సిటీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో “తేజ్ ఐ లవ్ యూ” ఆడియో రిలీజ్ వేడుకకు అందర్నీ ఆహ్వానించింది. ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఈ సందర్భంగా అనుపమ మాట్లాడుతూ తెలుగులో తనను ఆదరిస్తునందుకు తెలుగు ప్రేక్షకులు ధన్యవాదాలు తెలిపారు.