telugu navyamedia
క్రీడలు వార్తలు సామాజిక

ఇప్పుడు క్రికెట్ కాదు.. ప్రజల భద్రత గురించి ఆలోచించాలి: రవిశాస్త్రి

ravi shastri coach

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను కుదిపేస్తున్నా నేపథ్యంలో టీమిండియా కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో క్రికెట్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని శాస్త్రి స్పష్టం చేశాడు. ఇప్పుడు అందరి దృష్టి ప్రజల భద్రతపైనే ఉండాలన్నాడు. ఈ వైరస్‌పై అందరికీ అవగాహన కల్పించాలని సూచించాడు. ఇందులో భారత క్రికెటర్లు ముందున్నారని చెప్పాడు. కెప్టెన్‌ విరాట్ కోహ్లీ సహా పలువురు ఆటగాళ్లు సోషల్ మీడియా ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారని తెలిపాడు.

ప్రపంచ వ్యాప్తంగా క్రీడలు స్తంభించిపోయే అవకావం ఉందని దక్షిణాఫ్రికా, భారత్ మధ్య వన్డే సిరీస్‌ రద్దయిన సమయంలోనే భారత క్రికెటర్లకు తెలసన్నాడు. ఈ సిరీస్‌ కంటే ముందు టీమిండియా.. న్యూజిలాండ్‌లో పర్యటించింది. అయితే, భారత్‌లో కరోనా వ్యాప్తి మొదలైన సమయంలోనే మన క్రికెటర్లు స్వదేశానికి వచ్చారని శాస్త్రి చెప్పాడు. ఈ సిరీస్‌కు సిద్ధమవుతున్నప్పుడే వైరస్ ప్రభావాన్ని ఊహించామని, దాని వల్ల ఏదో జరుగుతుందని అనుకున్నామని తెలిపాడు. ఈ నెల రెండో వారంలో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌ రద్దవడం క్రికెటర్లను ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు.

Related posts