telugu navyamedia
క్రీడలు వార్తలు

డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం 15 మందితో భారత జట్టు ఎంపిక…

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో తలపడే భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం 15 మందితో కూడిన భారత జట్టును కొద్దిసేపటిక్రితం బీసీసీఐ ప్రకటించింది. విరాట్ కోహ్లీ సారథ్యం వహించనున్న ఈ జట్టులో ఓపెనర్ మయాంక్ అగర్వాల్, స్టార్ బ్యాట్స్‌మన్‌ కేఎల్ రాహుల్‌కు చోటు దక్కలేదు. దీంతో ఓపెనర్లుగా రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌లు ఆడడం ఖాయం అయింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానెతో పాటు వికెట్‌ కీపర్లుగా రిషభ్‌ పంత్‌, వృద్ధిమాన్‌ సాహాను బీసీసీఐ ఎంపిక చేసింది. తుది జట్టులో మాత్రం పంత్ ఆడనున్నాడు. రెగ్యులర్ టెస్టు ఆటగాళ్లు అయిన చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, రవిచంద్రన్ అశ్విన్ వంటి వారికి జట్టులో స్థానం లభించింది. గాయం కారణంగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో ఆడలేకపోయిన స్టార్ ఆల్‌రౌండర్‌ రవీందర్ జడేజా తిగిరి జట్టులోకి వచ్చాడు. తెలుగు ఆటగాళ్లు మహ్మద్‌ సిరాజ్‌, హనుమ విహారిలకు జట్టులో చోటు దక్కింది. జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్‌లు పేస్ విభాగంలో ఎంపికయ్యారు.

భారత జట్టు: రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌గిల్‌, పుజారా, విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), అజింక్య రహానె(వైస్‌ కెప్టెన్), హనుమ విహారి, రిషభ్‌ పంత్‌(కీపర్‌), సాహా(కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, జస్ప్రిత్‌ బుమ్రా, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమి, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌.

Related posts