ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత వంగవీటి రాధ విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదా అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ రాజధాని సమస్యతో వాటన్నింటిని పక్కన పెట్టాడని అన్నారు.హైటెక్ సిటీని చంద్రబాబు ప్రారంభించినా రాజశేఖర్ రెడ్డి ఆపలేదని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత 19 లక్షల రేషన్ కార్డులు తీసుకువచ్చారన్నారు.
ఇప్పటికీ తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా గత ప్రభుత్వం పనులను ఆపలేదన్నారు. ఇది కుల, మత సమస్య కాదని, మొత్తం ఆంధ్రరాష్ట్ర సమస్య అని చెప్పారు. రాబోయే రోజుల్లో అందరం కలిసి మన రాష్ట్రాన్ని కాపాడుకుందామని వంగవీటి రాధ పిలుపునిచ్చారు.
రాజధాని పేరుతో రైతులను ముంచారు: మంత్రి బొత్స