telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

త్వరలో లోకేష్ సైకిల్ యాత్ర.. ఇక నిత్యం ప్రజల మధ్యే..?

nara-lokesh-cycle

గత ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన టీడీపీ తిరిగి ఏపీలో పూర్వ వైభవం పొందడానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రంగంలోకి దిగబోతున్నారని తెలుస్తోంది. అంతేకాదు తన పొలిటికల్ ఇమేజ్ ను పెంచుకోవడానికి ప్రజల్లోకి వెళ్లేందుకు గానూ సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టే ఆలోచనలో ఉన్నారు. కరోనా ప్రభావం తగ్గితే డిసెంబర్ నుంచి యాత్రను మొదలు పెట్టే ఆలోచనలో నారా లోకేష్ ఉన్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.

2022 లో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, అందుకే ఇప్పుడు పార్టీ అధిష్టానం ఈ ఆలోచన చేసింది అని రాజకీయ పరిశీలకులు అంటున్నాయి.దీనిపై లోకేష్ రూట్ మ్యాప్ ని కూడా ఒక టీంకి ఇచ్చి సిద్దం చేయిస్తున్నారని తెలుస్తుంది. లోకేష్ సైకిల్ యాత్ర మొదలు పెట్టే లోపు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.

Lokesh chandrababuపార్టీలోని అన్ని అనుబంధ విభాగాల కమిటీలు నియమించడానికి కార్యాచరణ ప్రారంభించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.సైకిల్ యాత్ర పై ఇప్పటికే లోకేష్ ఒక ప్రణాళికను పార్టీ అధినేత చంద్రబాబు ముందు ఉంచారని, చంద్రబాబు కూడా దీనికి ఆమోదం తెలిపారని అంటున్నారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాతడిసెంబర్ లేదా వచ్చే ఏడాది మార్చ్ నుంచి గాని మొదలుపెట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

lokesh tdpగ‌తంలో ముగ్గురు నాయకులు, వైయస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, వైయస్ జగన్ పాదయాత్ర సూత్రాన్ని ఉపయోగించి ముఖ్యమంత్రులు అయ్యారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపాదయాత్రలో ప్రజల కష్టాలను స్వయంగా్ర తెలుసుకుని, 2004 ఎన్నికల్లో సీఎం కాగానే సుపరిపాలన సాగించారు. అర్హులందరికీ ఇళ్లు, పింఛన్లు, ఇతర ప్రభుత్వ పథకాలను అందజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారు. 

” వస్తున్న మీ కోసం” అనే నినాదంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్రలో 2340కి.మీ. దూరం నడిచారు. పాదయాత్రలో ప్రజల సమస్యలను అడిగితేలుసుకున్నారు.అప్పటి నుండి 2004 వ సంవత్సరం వరకు 9 సంవత్సరముల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగి, అత్యధిక కాలం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకునిగా చరిత్ర సృష్టించాడు.

2017 లో ఏపీ ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్ 2017 నవంబర్ 6న ఇడుపులపాయ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. 341 రోజులపాటు 3648 కి.మీ. దూరం నడిచారు. పాదయాత్రలో ప్రజల సమస్యలను అడిగితేలుసుకున్నారు. 2019 ఆరంభంలో ‘ప్రజా సంకల్ప యాత్ర’ను ముగించారు. 2019లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. 151 స్థానాల్లో విజయం సాధించి ఏపీ సీఎంగా జగన్ తన చిరకాల వాంఛను నెరవేర్చుకున్నారు.

Related posts