నేడు వరల్డ్ బార్బర్స్ డే సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు. నాయీ బ్రాహ్మణ వృత్తి ఓ కళ అని అభివర్ణించారు. ఆ కళలో నైపుణ్యం పెంచడం కోసం గత టీడీపీ హయాంలో కృషి చేశామని తెలిపారు. సెలూన్ అంటే కేవలం జీవనాధారం కోసం కాకుండా, ఒక పరిశ్రమలా ఎదగాలన్న ఆలోచనతో అవసరమైనవన్నీ చేశామని వివరించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీ కార్పొరేషన్ నిర్వీర్యమైపోయిందని తెలిపారు ఆదరణ పథకం రద్దయిపోయిందని విమర్శించారు. రూ.5 లక్షల ప్రమాద బీమా పత్తా లేదు. జగన్ గారు, 5.50 లక్షల మందిలో కేవలం 38 వేల మందికే చేదోడు ఇచ్చి నాయీ బ్రాహ్మణులకే సంక్షేమ ‘కటింగ్’ చేశారు” అంటూ లోకేశ్ విమర్శించారు.