telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

రైతులకు బేడీలు వేసిన ఘన చరిత్ర జగన్ దే..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలిరోజే వాడివేడిగా మొదలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రైతులు భరోసా లేని వ్యవసాయం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ.. బీఏసీలో పంట నష్టంపై ఒక్క మాట మాట్లాడలేదన్నారు. తమది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని ముఖ్యమంత్రి జగన్ మరోసారి చెప్పారని నిమ్మల అభిప్రాయపడ్డారు. ధరల స్థిరీకరణ పేరుతో రైతులను మోసం చేస్తున్నారు. రైతుల ఇబ్బందులపై మేము చర్చ చేస్తామని ప్రభుత్వం చర్చకు రాకుండా పారిపోయిందన్నారు. రాష్ట్రంలో రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ని రూ. 15 వేలకే కుదించడం దారుణం అని వాపోయారు. రైతులకు ఇచ్చే ఇన్సూరెన్స్ ని వైసీపీ ప్రభుత్వం గంగలో కలిపేశారు. టీడీపీ హయాంలో రైతులకు 4 వేల 5 కోట్లు ఇన్సూరెన్స్ గా అందించడం జరిగిందని నిమ్మల గుర్తుచేశారు. ప్రకటనలు ఇస్తున్నారు కానీ పని జరగడం లేదు. సున్నా వడ్డీ అంటూ ఎంతో ఆర్భాటంగా చెప్పారు కానీ లక్ష లోపు ఉన్న వారికి మాత్రమే ఇస్తున్నారని, టీడీపీ హయాంలో 15270 కోట్లు రైతు భరోసా ఇస్తే ఈ ప్రభుత్వం ఇచ్చింది సున్నా అంటూ నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. రైతు భరోసా రైతు దగా గా మారిందన్నారు నిమ్మల. తమ ప్రభుత్వం హయాంలో రైతులకు అవసరమైన పనిముట్లను సగం ధరకే అందించాం. వైసీపీ ఎంతమంది రైతులకు ఇచ్చిందో చెప్పాలి. రాజధాని రైతులకు ఇన్ని రోజుల నుంచి పోరాటం చేస్తుంటే వారిని కన్నెత్తి కూడా చూడటం లేదు. రైతులకు బేడీలు వేసిన ఘన చరిత్ర జగన్ కే దక్కుతుంది. రైతు సమస్యలపై మేము సభలో నిలదీస్తామని అధికారపక్షం చర్చ నుంచి పారిపోయిందని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

Related posts