telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పసుపు రైతులను తక్షణమే ఆదుకోవాలి: లోకేశ్ డిమాండ్

Nara Lokesh

లాక్ డౌన్ ఆంక్షలతో పసుపు రైతులు గిట్టుబాటు ధరల్లేక నానా ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఈ మేరకు పసుపు రైతులను ఆదుకోవాలని లోకేశ్ ఏపీ సీఎం జగన్ కు లేఖ రాశారు. క్వింటాకు రూ.15 వేలు అయితే తప్ప పసుపుకు గిట్టుబాటు కాదని ఎన్నికల ముందు ఊదరగొట్టిన వైసీపీ ఇప్పుడెందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.

ప్రభుత్వం పసుపు క్వింటా ధర రూ.6,850 అని ప్రకటించినా, ఆ ధర కూడా లభించని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్వింటాకు కనీసం రూ.10 వేలు ఇస్తే తప్ప రైతులు కోలుకునే పరిస్థితి లేదని, ఇప్పటికైనా కష్టాల్లో ఉన్న పసుపు రైతులను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఓ వైపు లాక్ డౌన్ ఆంక్షలు, మరో వైపు అరకొర కొనుగోళ్లతో నష్టాలపాలవుతున్నారని లోకేశ్ తన లేఖలో పసుపు రైతుల సమస్యలను వివరియాంచారు.

Related posts