telugu navyamedia
క్రైమ్ వార్తలు

గుంటూరు జిల్లాలో తెదేపా నేత దారుణ‌హ‌త్య‌..

గుంటూరు జిల్లాలో దారుణం జ‌రిగింది. మాచర్ల నియోజకవర్గం గుండ్లపాడులో టీడీపీ నేత తోట చంద్రయ్యను ప్రత్యర్థులు న‌డిరోడ్డుపై దారుణంగా హత్య చేశారు.

మాచర్ల గ్రామానికి టీడీపీ ఇంఛార్జ్‌గా చంద్రయ్య ఉన్నారు. స్థానికంగా టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.. రాజకీయంగా ప్రత్యర్థుతో గత కొన్ని రోజులుగా చంద్రయ్యకు వివాదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో చంద్రయ్యపై కోపం పెంచుకున్న ప్రత్యర్థులు అతని అడ్డుతొలగించుకోవాలని భావించారు.

ఈ క్రమంలోనే చంద్రయ్య పని నిమిత్తం గురువారం ఉదయం 7 గంటల సమయంలో ఇంటి నుంచి బైక్‌పై బయలుదేరి వెళ్లాడు. అప్పటికే అతని కోసం వేచి చూస్తున్న ప్రత్యర్థులు పథకం ప్రకారం బైక్‌కు కర్ర అడ్డు పెట్టి కిందపడేలా చేశారు. అనంతరం అతని తలపై రాయితో కొట్టి తరువాత కత్తులు, కర్రలతో దాడి చేసి హతమార్చారు. హత్య అనంతరం ప్రత్యర్థులు పరారయ్యారు. ఘటన నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

చంద్రయ్య రాజకీయంగా ఎదుగుతుడటం ఓర్వలేకే ప్రత్యర్థివర్గం అతన్ని చంపేసినట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని  ఎలాంటి ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.

Related posts