telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఓడిపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమంటూ రోజాకు అచ్చెన్నాయుడు స‌వాల్‌..

వైసీపీ నగరి ఎమ్మేల్యే రోజాకు రోజా వేసిన ఛాలెంజ్ కు కౌంటర్ గా.. ఆమె గెలిస్తే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయం అంటూ ప్రతి సవాల్ విసిరారు  తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు .

ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలుగుదేశం పార్టీకి 160 సీట్లు వస్తాయంటూ అచ్చెన్నాయుడు పెద్ద జోక్ చేశారని ఎద్దేవా చేసిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. తిరుపతి ఎంపీ ఎన్నికల సమయంలో ‘పార్టీ లేదు.. తొక్కా లేదు’ అన్న వ్యక్తి ఇప్పుడు 160 సీట్లంటూ జోక్ చేస్తున్నారని.. గట్టి చట్నీ గట్టిగా తింటే అచ్చెన్నాయుడు 160 కిలోలు పెరుగుతారేమోగానీ.. నువ్వు గానీ చంద్రబాబు నాయుడు గానీ తలకిందులుగా తపస్సు చేసినా 160 సీట్లు కాదు కదా.. ఇప్పుడున్న 23 సీట్లు రావడం కూడా కష్టం.. నీకు సరదాగా ఉంటే టెక్కలిలో రాజీనామా చేసి ఎన్నికలకు రా.. అంటూ సవాల్ విసిరింది.

రోజా సవాల్ పై అచ్చెన్నాయుడు కూడా అదే స్థాయిలో స్పందిస్తూ..రోజాకు ధైర్యముంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ఎన్నికలకు సిద్ధపడాలని అచ్చెన్నాయుడు అన్నారు. నగరిలో టీడీపీ ఓడిపోతే వచ్చే ఎన్నికల్లో ఆ స్థానాల్లో మేం పోటీ చేయబోమని అచ్చెన్నాయుడు స‌వాల్ విసిరారు.

ఎన్టీఆర్ టీడీపీ స్థాపించాకే మహిళలకు ఆస్తిలో హక్కు దక్కిందని గుర్తుచేసిన ఆయన.. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేలా చంద్రబాబు కృషి చేశారని.. ప్రజలు మోసపోయి.. జగన్‌కు ఓటేసి అధికారం కట్టబెట్టారన్నారు.. అధికారం కోసం ఏ గడ్డైనా తినే వ్యక్తి జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. కులం, మతం, ప్రాంతం వంటి అంశాలను పట్టించుకోని వ్యక్తి చంద్రబాబు అన్నారు.

సింపతీ కోసం కోడి కత్తి డ్రామా ఆడారు.. అయినా దాని వల్ల సింపతీ రాలేదని.. మరింత సింపతీ కోసం తన బాబాయిని చంపేసినా పట్టించుకోని వ్యక్తి జగన్ అని ఆరోపించారు. 151 సీట్లు వచ్చినా.. అతి తక్కువ కాలంలో సీఎం వైఎస్‌ జగన్‌ విపరీతమైన వ్యతిరేకతను పెంచుకున్నారన్న ఆయన.. తెలుగు మహిళా అధ్యక్షురాలైన అనితను వైసీపీ ఎమ్మెల్యేలు అనరాని మాటలు అంటున్నారని ఫైర్‌ అయ్యారు

Related posts