గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ రాజీనామాపై టీడీపీ నేత కేశినేని నాని స్పందించారు. టీడీపీని వీడేందుకు వల్లభనేని వంశీ సిద్ధంగా లేరని అన్నారు. అలాగే ఆయనను వదులుకోవడానికి టీడీపీ కూడా సిద్ధంగా లేదని పేర్కొన్నారు. ఆయన తరఫున పోరాడడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని కేశినేని తెలిపారు.
వంశీతో మాట్లాడడానినికి తాను ప్రయత్నిస్తున్నానని కేశినేని నాని తెలిపారు. వంశీలాంటి మంచి రాజకీయ నేత రాజకీయాలను దూరంగా ఉండడం మంచిది కాదని అన్నారు. కేసులకు భయపడి రాజకీయాలకు దూరం కాకూడదని హితవు పలికారు. వల్లభనేని వంశీది టీడీపీ డీఎన్ఏ అని కేశినేని వ్యాఖ్యానించారు.