వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. తాను ఆత్మకూరుకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. అనంతపురం టీడీపీ నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని అన్నారు. పోలీసులు ప్రజలకు న్యాయం జరిగేలా పనిచేయాలన్నారు.
అనంతపురం జిల్లాలో టీడీపీకి చెందిన 40 మందిపై కేసులు పెట్టారు. అట్రాసిటీ కేసులు పెట్టి టీడీపీ నేతలను బెదిరిస్తున్నారు. పల్నాడు పులిలా ఉండే కోడెలను ఎన్నో రకాలుగా వేధించారు. చివరకు ఆత్మహత్య చేసుకునేందుకు కారణమయ్యారు. ఆత్మకూరులో 130 మందిని ఊరి నుంచి తరిమేశారు. టీడీపీ కార్యకర్తలను దారుణంగా వేధిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.
హైకోర్టు తీర్పు టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టు: శ్రీధర్ బాబు