telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ నేతల దుర్మార్గాలతో రాష్ట్రానికి కీడు: చంద్రబాబు

chandrababu

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డాడు. దేశమంతా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలుచేస్తోంటే, ఏపీలో మాత్రం వైఎస్ జగన్ తన సొంత ‘రాజారెడ్డి రాజ్యాంగం’ అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీ ప్రజలకు ఆయన బహిరంగ లేఖరాసి పలు విషయాలు వెల్లడించారు.

రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలను చూస్తే అంబేద్కర్ ఆత్మ క్షోభిస్తుంది. దేశ చరిత్రలోనే ఇంతటి రాక్షసపాలన, విధ్వంసకాండ ఏ ప్రభుత్వమూ చేయలేదని ఆయన విమర్శించారు. ఏడాదిగా రాష్ట్రంలో పరిణామాలు ఆందోళనకరంగా మారాయన్నారు. వైసీపీ నేతల దుర్మార్గాలతో రాష్ట్రానికి కీడు ఏర్పడిందని లేఖలో పేర్కొన్నారు. వీటిని తెలియజేసేందుకే తాను ఈ బహిరంగలేఖను రాస్తున్నానని ఆయన అన్నారు.

Related posts