telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాష్ట్రంలోని ప్రతి వ్యవస్థను నాశనం చేశారు: చంద్రబాబు

chandrababu

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి విరుచుకుపడ్డారు. తమ ప్రభుత్వం హయాంలో నిర్మించిన ప్రజావేదికను కూల్చి నేటికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా దీనిపై ఆ పార్టీ చంద్రబాబు స్పందించారు. ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు ప్రజా వేదికను కూల్చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో‌ విధ్వంసానికి దానితో బీజం వేశారు. ప్రజావేదికను కూల్చేయడం జగన్‌ పాలనకు అద్దం పడుతోందన్నారు.

రాష్ట్రంలోని ప్రతి వ్యవస్థను, సంస్థను ఏడాది సమయంలోనే నాశనం చేశారని చంద్రబాబు అన్నారు.ఒక భ‌వ‌నం క‌ట్ట‌డం ఎంతో క‌ష్టంతో కూడుకున్న పని అని, దాని వల్ల చాలా ఉపయోగం ఉంటుందని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. అయితే, కూల‌గొట్ట‌డం చిటికెలో ప‌ని అని, తీవ్ర న‌ష్టం జరుగుతుందని తెలిపారు. ఇది తెలిసి కూడా విధ్వంసానికే జైకొడుతున్నారని విరుచుకుపడ్డారు. ప్రజావేదికను కూల్చి ఏడాది గడుస్తున్న సందర్భంగా లోకేశ్ ట్వీట్లు చేశారు.

Related posts