sheshachalam

శేషాచలం అడవుల్లో స్మగ్లర్ల బరితెగింపు

14

తిరుపతి శేషాచలం అడవుల్లో స్మగ్లర్లు మరోసారి రెచ్చిపోయారు. ఎర్రచందనం అక్రమ రవాణా కోసం శేషాచలం అడవుల్లో 25 మందికిపైగా స్మగ్లర్లు చొరబడ్డారు. దీంతో అనుమానం వచ్చిన టాస్క్ ఫోర్స్ సిబ్బంది అడవిలో కూంబింగ్ నిర్వహించారు. టాస్క్ ఫోర్స్ అధికారులను చూసిన స్మగ్లర్లు వారిపై రాళ్లతో దాడి చేసి, అక్కడి నుంచి పారిపోయినట్టు తెలుస్తోంది. వెంటనే అపరమత్తమైన టాస్క్ ఫోర్స్ సిబ్బంది వారిని వెంబడించి, వారి కోసం రాత్రంతా గాలించారు. కూంబింగ్ లో పలువురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకున్నా కూడా ఎర్ర చందనం అక్రమ రవాణా ఆగడం లేదు. పోలీసుల కళ్లుగప్పి ఇలాంటి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు స్మగ్లర్లు.