telugu navyamedia
ఆంధ్ర వార్తలు

మ‌న‌లక్ష్యం 175 సీట్లు ..పార్టీ నేత‌ల‌కు సీఎం జ‌గ‌న్ 8 నెల‌లు డెడ్‌లైన్‌..

*గడప గడపకు కార్య‌క్ర‌మం స‌క్సెస్ చేయాల‌ని సీఎం పిలుపు
*వైసీపీ నేత‌ల‌కు సీఎం జ‌గ‌న్ 8 నెల‌లు డెడ్‌లైన్‌..
*గడప గడపకు కార్య‌క్ర‌మం పై ప్ర‌తీ నెల స‌మీక్ష ఉంటుంద‌న్న సీఎం

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వర్క్‌షాప్‌ నిర్వహించారు.మంత్రులు, రీజనల్ కో ఆర్డినేటర్స్, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు వర్క్‌షాప్‌కు హాజరయ్యారు.

వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి తీరాలని, ఇది మన లక్ష్యం, ఇది పెద్ద కష్టమేం కాదని పార్టీ నేతలకు సీఎం జ‌గ‌న్ దిశానిర్దేశం చేశారు. వారికి 8 నెల‌లు డెడ్‌లైన్ పెట్టారు. ఆ లోపు ప్ర‌తి ఒక్క‌రిలోనూ మార్పు రావాల్సిందేన‌ని హెచ్చ‌రించారు.

గడపగడపకూ కార్యక్రమాన్ని ఏ రకంగా చేశాం? ఎలా చేస్తున్నాం? ఇంకా ఎలా మెరుగుపరుచుకోవాలి? ఎలా సమర్థత పెంచుకోవాలి? అన్నదాన్నికూడా మనం నిరంతరంగా చర్చించుకోవాలనే వర్క్ షాప్ ఏర్పాటు చేశామని అన్నారు .. . గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంపై ప్ర‌తీ నెలా స‌మీక్ష ఉంటుంద‌ని తెలిపారు.

గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వెళ్ళి కార్య‌క్ర‌మాల‌ను వివ‌రించాల‌ని , ప్ర‌తీ ఒక్క‌రికీ క‌ల‌వాల‌ని, ఏ ఒక్క‌రికీ వ‌దిలిపెట్టొద్ద‌ని  సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ఒక్కొ స‌చివాల‌యానికి రెండురోజులు పాటు కేటాయించాల‌ని, నెలలో 20 రోజుల చొప్పున 10 సచివాలయాల్లో గడప గపడకు కార్యక్రమం నిర్వహించాలని సీఎం ఆదేశించారు.

మనకు ఓటు వేయనివారికి కూడా రాజకీయాలు, పార్టీలు చూడకుండా పారదర్శకంగా మేలు చేశామన్నారు చరిత్రలో మనం ఒక ముద్ర వేశామ‌న్న సీఎం జ‌గ‌న్‌..సంతృప్తిస్థాయిలో మంచి చేశామని చెప్పుకోగలుగుతున్నామ‌న్నారు. ఇక మనం చేయాల్సిందల్లా.. ప్రజల మద్దతును మనం తీసుకోవడమేన‌ని నేత‌ల‌కు తెలిపారు.

అంద‌రూ క‌ష్ట‌ప‌డి ప‌నిచేయాల్సిందే సీఎం జ‌గ‌న్ దిశానిర్దేశం చేశారు. 8 నెల‌ల్లో ఎవ‌రి భ‌విష్య‌త్తు ఎంటో తెలుస్తుంద‌ని, స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోతే, గ్రాఫ్ పెర‌గ‌క‌పోతే త‌న చీటి చించేయం ఖాయ‌మ‌ని తెలుస్తోంది.

Related posts