BREAKING NEWS:
TANA--Inviting-applications

స్కాలర్‌షిప్‌ లకోసం దరఖాస్తుల ఆహ్వానం…

44

న్యూయార్క్ నగరంలో ఏర్పాటు చేసిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా), తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు తన వంతు సహాయంగా పలు సేవా కార్యక్రమాలను చేపడుతుంది. 1977వ సంవత్సరంలో ఏర్పాటైన తానా ఆర్గనైజషన్, అప్పటినుంచి ఇప్పటివరకు ఎలాంటి లాభాపేక్ష ఆశించకుండా తెలుగు ప్రజలకు విశేష సేవలనందిస్తుంది. ప్రతి ఏటా ఎంతో మంది విద్యార్థులు అమెరికాలో స్థిరపడడానికి వచ్చినవారికి, ఆర్థిక స్థోమత సరిగ్గా లేనివారికి సహాయ పడటం కోసం ఒక్కో విద్యార్థికి $2000 డాలర్లను అందించనుంది.

2018-19 సంవత్సరంలో అమెరికాలో ఉన్నత చదువుల కోసం వచ్చేవారికోసం స్కాలర్‌షిప్‌లు అందచేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మొత్తం ఏడు రకాల గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌లను అందించనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని తెలుగు విద్యార్థులు ఎవరైనా ఉన్నత చదువులకోసం అమెరికా వెళ్లే విద్యార్థులు ఎవరైనా ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోవచ్చు అని తెలిపింది. అయితే స్టైఫండ్ వివరాలు ఒక్కో సెమిస్టర్ కు $500 డాలర్లు వరుస నాలుగు సెమిస్టర్లకు స్కాలర్‌షిప్‌ గా ఇస్తుంది.

applications-invited-for-sc

అంతే కాకుండా మరో నాలుగు యూత్ స్కాలర్‌షిప్‌లను కూడా అందించనుంది. ఉత్తర అమెరికాలో హైస్కూలు విద్యను పూర్తి చేసుకుని కాలేజి చదువులకు వెళ్లే విద్యార్థులకు నాలుగు రకాల యూత్ స్కాలర్‌షిప్‌లను అందించనుంది. ఈ స్కాలర్ షిప్ ఒక్కోక్కరికి 1000 డాలర్లను ఇవ్వనుంది.

వివరాలకోసం అధికారిక వెబ్ సైట్ http://www.tana.org  లో లేదా తానా ఫౌండేషన్‌ ఛైర్మన్‌ నిరంజన్‌ శృంగవరపు(248-342-6872)ను సంప్రదించవచ్చు.