telugu navyamedia
సినిమా వార్తలు

మెగా హీరో డెబ్యూ సినిమా నుంచి తప్పుకున్న విజయ్ సేతుపతి

Vijay-Sethupathi

సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు డైరెక్షన్‌లో వైష్ణ‌వ్ తేజ్ హీరోగా “ఉప్పెన” అనే చిత్రం రూపొందుతుంది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. జాలర్ల నేపథ్యంలో ఎమోషనల్‌ లవ్‌ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ చిత్రంలో ప్రముఖ తమిళ హీరో విజయ్ సేతుపతి కీలకపాత్రలో నటిస్తున్నారని అన్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ప‌లు త‌మిళ సినిమాలు చేస్తూనే మ‌రోవైపు తెలుగు సినిమాల‌లో న‌టించేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. “సైరా” అనే ప్ర‌తిష్టాత్మ‌క చిత్రంలో నటిస్తున్నారు. అయితే ప‌లు కార‌ణాల వ‌ల‌న ఆయ‌న ఈ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకున్నాడ‌ని తెలుస్తుంది. అయితే ఇప్పుడు విజ‌య్ సేతుప‌తి కాల్షీట్స్ ఖాళీ లేవ‌ని తాజా స‌మాచారం. విజ‌య్ సేతుప‌తి పాత్ర‌లో ప‌వ‌ర్‌ఫుల్ యాక్ట‌ర్ కోసం చిత్ర బృందం అన్వేషిస్తుంద‌ట‌. దీనిపై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది.

Related posts