telugu navyamedia
రాజకీయ

అమ‌రుల‌ భౌతికకాయాలు తరలింపు..

తమిళనాడులోని నీలగిరి కొండల్లో  బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, అతని స‌తీమ‌ణి మధులికతో ​ సహా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. గురువారం వారి భౌతికకాయాలను తీసుకువెళుతున్న వాహనాలపై  స్థానికులు నివాళులు అర్పించారు.

Mortal remains of CDS Bipin Rawat will reach Delhi today; Rajnath to brief Parliament | Latest News India - Hindustan Times

నీలిగిరి జిల్లాలోని మద్రాస్​ రెజిమెంటల్​ సెంటర్​ నుంచి సూలుర్​ ఎయిర్​బేస్ వరకు బారులు తీరారు. భౌతికకాయాన్ని తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రజలు రోడ్లకిరువైపులా నిలబడి కాన్వాయ్​పై పూలు వ‌ర్షం కురిపించారు. భారత్​ మాతాకి జై, వీర వణక్కం అంటూ నినాదాలు చేశారు.

Gen Bipin Rawat Death News LIVE Updates: Lone Survivor Group Captain Varun Singh on Life Support, Rajnath Singh to Parl; Black Box of Chopper Recovered

హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వారిలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ భార్య శ్రీమతి మధులికా రావత్, అతని రక్షణ సలహాదారు బ్రిగ్ లఖ్‌బిందర్ సింగ్ లిద్దర్, స్టాఫ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ సిబ్బందితో సహా మరో తొమ్మిది మంది సాయుధ దళాల సిబ్బంది ఉన్నారు. కమాండర్ పృథ్వీ సింగ్ చౌహాన్, స్క్వాడ్రన్ లీడర్ కుల్దీప్ సింగ్, జూనియర్ వారెంట్ ఆఫీసర్ రాణా ప్రతాప్ దాస్, జూనియర్ వారెంట్ ఆఫీసర్ అరక్కల్ ప్రదీప్, హవల్దార్ సత్పాల్ రాయ్, నాయక్ గుర్ సేవక్ సింగ్, నాయక్ జితేంద్ర కుమార్, లాన్స్ నాయక్ వివేక్ కుమార్, లాన్స్ నాయక్ బి సాయి తేజ ఉన్నారు.

కాగా..రేపు రావత్‌ నివాసంలో భౌతిక‌కాయాన్ని ఉద‌యం 11 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు సందర్శనార్థం ఉంచనున్నారు. అనంతరం బ్రార్ స్క్వైర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Related posts