telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

గిన్నిస్‌ బుక్‌లో స్థానం దక్కించుకున్న.. తైక్వాండో ఆటగాడు సాయి దీపక్‌..

taekwondo player deepak in guinness record

సత్తాకు సాన పట్టి..అవాంతరాలను అధిగమించి అద్భుత విజయాలు సాధించాడు. దిమ్మదిరిగే పంచులతో ప్రత్యర్థులను ఓడించి విజయాలను సొంతం చేసుకుని గిన్నిస్‌ బుక్‌లో తన పేరు పదిలం చేసుకున్నాడు నగరానికి చెందిన తైక్వాండో ఆటగాడు సాయి దీపక్‌. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4 రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. వీటి సాధనలో ఎదురైన అనుభవాలను ‘ఈనాడు’తో పంచుకున్నారిలా. చిన్ననాటి నుంచి మార్షల్‌ ఆర్ట్స్‌ సినిమాలు చూస్తూ పెరిగా. మా నాన్న ఎక్కువగా ఈ తరహా చలన చిత్రాలనే చూపించేవారు. అలా రెండో తరగతిలో ఉన్నపుడే కరాటే తరగతులకు హాజరయ్యాను. సినిమాల ప్రభావమేమో తెలియదు కానీ నిజ జీవితంలోనూ హీరోల్లా పోరాడాలన్నది నా కోరిక. ఇంటర్‌ చదివేటప్పుడే నన్ను నేను క్రమశిక్షణలో పెట్టుకోవాలనుకున్నాను. ఫైటింగ్‌ను జీవితంగా మలచుకునేందుకు కరాటే తరగతుల నుంచి కుంగ్‌ఫూ వైపు అడుగులు వేశాను. ‘సుబ్బు’ మాస్టర్‌ దగ్గర శిక్షణలో చేరాను.

ఒలింపిక్స్‌ స్ఫూర్తిగా విజయ కేతనం..
ఇవిగో ఆ నాలుగు..
* 2017 నవంబరు: ‘మోస్ట్‌ ఫుల్‌ కాంటాక్ట్‌ ఎల్బో స్ట్రైక్స్‌’ విభాగంలో 60 సెకన్లలో 142 స్ట్రైక్స్‌.
* 2017 డిసెంబరు : ‘నీ స్ట్రైక్స్‌’ విభాగంలో 180 సెకన్లలో 175 స్ట్రైక్స్‌.
* 2019 ఆగస్టు: మోస్ట్‌ వన్‌ లెగ్‌ ఫుల్‌ కాంటాక్ట్‌ నీ స్ట్రైక్స్‌ వియరింగ్‌ 5 కేజీల యాంకిల్‌ వెయిట్‌ విభాగంలో 180 సెకన్లలో 87 స్ట్రైక్స్‌.
* 2019 సెప్టెంబరు: మోస్ట్‌ సైడ్‌ లంగ్స్‌ ఇన్‌ వన్‌ మినిట్‌ (పురుషులు) విభాగంలో 60 సెకన్లలో 59 స్ట్రైక్స్‌.

Related posts