telugu navyamedia
వార్తలు సామాజిక

రంజాన్ మాసంలో ఇంటి వద్దే ప్రార్థనలు చేసుకోవాలి: తబ్లిగీ జమాత్ చీఫ్

tabligi jamath masood

రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలంతా ఇంటి వద్దనే ఉంటూ ప్రార్థనలు చేసుకోవాలని ఢిల్లీ తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ ఖందాల్వీ పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారి విస్తరణకు కారణమయ్యారనే ఆరోపణలతో పోలీసు కేసులను ఎదుర్కొంటున్న ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్వారంటైన్ లో ఉన్న వారిలో అధికులకు ఇన్ఫెక్షన్ లేదన్నారు.

పరీక్షల్లో వారికి నెగెటివ్ వస్తోందని ఆయన అన్నారు. పాజిటివ్ నిర్ధారణ అయిన వారు కూడా చికిత్స పొందిన తర్వాత మహమ్మారి నుంచి బయటపడ్డారని చెప్పారు. తనతో పాటు మరికొందరు క్వారంటైన్ లోనే ఉన్నామని తెలిపారు. కరోనా నుంచి బయటపడిన వారు తమ బ్లడ్ ప్లాస్మాను ఇతరులకు డొనేట్ చేయాలని ఖందాల్వీ కోరారు. కరోనాతో పోరాడుతూ ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారికి సహాయపడాలని విన్నవించారు.

Related posts