telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు… స్థానికుల ఆగ్రహం

Swasthik

హిందూ, బౌద్ధమతాల్లో పవిత్రమైన గుర్తుగా భావించే స్వస్తిక్ మార్కును ప్రపంచంలో చాలామంది చెడుగా భావిస్తారు. దీనికి ప్రధాన కారణం నాజీ నేత అడాల్ఫ్ హిట్లర్. ప్రస్తుతం ఈ గుర్తును జాత్యహంకారం, అతివాదానికి ప్రతీకగా ఉపయోగిస్తున్నారు. అటువంటి ఈ గుర్తును పది చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటి ముందు ముద్రించుకున్నాడో కాలిఫోర్నియా వాసి. ఈ గుర్తు తమ మనోభావాలను దెబ్బతీస్తోందని స్థానికులు వాపోతున్నారు. అయితే తనకు స్వస్తిక్ గుర్తును ప్రపంచవ్యాప్తంగా దేనికోసం ఉపయోగిస్తారో తెలియదని, ఆ గుర్తు తనకు నచ్చడంతోనే తన ఇంటిముందు ముద్రించానని ఓ ఇంటర్వ్యూలో స్టీవ్ చెప్పాడు. తన ఇంట్లో తనకు ఇష్టం వచ్చిన గుర్తును ముద్రించుకుంటానని, దీన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని స్టీవ్ అన్నాడు. తన ఇంట్లోని స్వస్తిక్ గుర్తుకు నాజీలతో సంబంధం లేదని, తనకు బౌద్ధమతంపై ఆసక్తని అందుకే ఆ గుర్తు వేయించుకున్నానని చెప్పాడు.

Related posts