శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి చాతుర్మాస్య దీక్ష

110

ప్రతి సంవత్సరం విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి ఋషికేశ్ లోని పవిత్ర గంగా నది తీరంలో చాతుర్మాస్య దీక్ష చేపడుతున్నారు .
ఈ సంవత్సరం కూడా స్వామివారు ఋషికేశ్ లో ఈనెల 27న దీక్ష చేపడుతున్నారు.
ఈ దీక్ష కోసం ముందుగా స్వామివారు పీఠం ధర్మాధికారి జి . కామేశ్వర శర్మను ఋషికేశ్ పంపించారు .

భారతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లే ఋషికేశ్ లోని గంగా తీరంలో శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి వారు సాధు సంతువుల సమావేశములు జరుపుతారు . ఇది ఆనవాయితీగా వస్తున్నది . ఈ ఏర్పాట్లు చూసి అక్కడి మఠాధిపతులు , పీఠాధిపతులను ఆహ్వానించమని స్వామి వారు కామేశ్వర శర్మను స్వరూపానంద స్వామి వారు ఆదేశించారు .
స్వామివారి ఆదేశించడంతో ఋషికేశ్ వచ్చిన ధర్మాధికారి జి . కామేశ్వర శర్మ మఠాధిపతులు , పీఠాధిపతులను దర్శించి చాతుర్మాస్య ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఋషికేశ్ కైలాసాశ్రమ మండలేశ్వరులు స్వామి దివ్యానంద సరస్వతీ స్వామివారిని దర్శించి , వారికి ధర్మాధికారి చాతుర్మాస్య ఆహ్వాన పత్రం అందజేశారు. .