telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

భావితరాలు ఎదగడానికి ఇంగ్లీష్ అవసరం: స్వరూపానందేంద్ర

swarupananda swami on J & K issue

భావితరాలు ముందుకు ఎదగడానికి ఇంగ్లీష్ ఎంతో అవసరమని విశాఖ శ్రీ శారద పీఠం పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ అన్నారు. శనివారం అన్నవరంలో ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడుతూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయానికి తన ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. దీంతో సామాన్య, పేద ప్రజల‌ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉన్నత స్థాయిలో రాణిస్తారని అభిలాషించారు.

నేడు బతకడానికి, బతుకుదెరువుకు ఇంగ్లీష్ అవసరం ఉందని, లేదంటే దేశ, విదేశాల్లో ఉన్న మన తెలుగు బిడ్డలు రాణించడం కష్టమవుతుందని చెప్పారు. ఇంగ్లీష్ కారణంగానే ఏపీ, తెలంగాణకు చెందిన వారు ఎందరో దేశ, విదేశాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారని అన్నారు. అయితే అమ్మా అని పిలవడానికి తెలుగు కావాలని, తెలుగు మన కన్నతల్లి వంటిదని అభిప్రాయపడ్డారు.

Related posts