telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

స్వర్ణ ప్యాలెస్ మృతుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ!

covid entre fire vijayawada

ఇటీవల విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలకు ఏపీ మంత్రులు రూ.50 లక్షల చొప్పున చెక్కులను పరిహారంగా అందించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ కుటుంబ పెద్దలు చనిపోవడంతో వారి కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం జగన్ మానవత్వంతో రూ.50 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారని తెలిపారు.

సీఎం ఇచ్చిన హామీ మేరకు ఇవాళ మృతుల కుటుంబాలకు పరిహారం అందించామని వెల్లడించారు. విజయవాడకు చెందిన ఆరుగురికి, మచిలీపట్నంకు చెందిన ముగ్గురికి చెక్ లు అందజేసినట్టు తెలిపారు. భర్తను కోల్పోయిన కందుకూరుకు చెందిన యువతి గర్భవతి అయినందున ఆమె ఇంటికి వెళ్లి చెక్ అందిస్తామని మంత్రి వివరించారు.ఈ కార్యక్రమంలో మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని, మల్లాది విష్ణు పాల్గొన్నారు.

Related posts