telugu navyamedia
వార్తలు సామాజిక

స్వామి నీ చూడాలనిపించి వచ్చేసారు.!

ఉత్తర భారత దేశంలో సుప్రసిద్దులైన మహాత్ములు గురు శర్నానంద్ జీ మహారాజ్ ఇటీవల మథుర లోని తమ ఉదాసీన్ ఆశ్రమం నుండి ఎవరికీ చెప్పకుండా తిరుమలకు వచ్చారు..

శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకోవాలన్న ఆలోచన వచ్చిన వెంటనే ఆయన ఒంటరిగా తన శిష్యులేవారికీ చెప్పకుండా వచ్చేసారు.

దీంతో ఆయన శిష్యులు భక్త జనులు తీవ్ర ఆందోళన కు గురయ్యారు.. అంతటా వెతికి పోలీసులకు కూడా సమాచారమిచ్చారు..

తెలంగాణ లో కూడా మహారాజ్ కి ఉన్న శిష్యులు ఇక్కడి పోలీస్ అధికారుల సహాయం అర్థించారు. అందరి ప్రయత్నం ఫలించింది మహారాజ్ జీ కాళహస్తి లో ఉన్నట్లుగా సమాచారం రావడంతో ఆయన శిష్యులు నిన్నటి ఉదయం కాళహస్తి కి చేరుకుని తమ గురువుని కలుసుకున్నారు.

శ్రీవారి దర్శనం చేసుకుని తల నీలాలు సమర్పించాలనే ఆలోచన వచ్చిన వెంటనే గురువు గారు ఇక్కడికి వచ్చారని, శ్రీవారి దర్శన అనంతరం కాళహస్తి క్షేత్రానికి చేరుకుని మహా శివుడు దర్శనం చేసుకున్నారని వారు తెలిపారు.

యూపీ ముఖ్యమంత్రి యోగి, కేంద్ర మంత్రి అమిత్ షా తదితర రాజకీయ ప్రముఖులు కూడా అపుడపుడు మహారాజ్ జీ నీ దర్శించుకుంటారు.

Related posts