మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఓ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు ఓ కీలక పాత్రలో కనిపించనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. అక్కినేని నాగార్జున మేనల్లుడు, యంగ్ హీరో సుశాంత్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడట. ఈ విషయాన్ని సుశాంత్ స్వయంగా తన ట్విటర్ ద్వారా ప్రకటించాడు. “అల్లు అర్జున్ 19వ సినిమా సెట్స్‌లో ఇది నాకు మొదటి రోజు. నాకెంతో ఇష్టమైన దర్శకుల్లో ఒకరైన త్రివిక్రమ్, ‘ఆర్య’ నుంచి నేనెంతో అభిమానిస్తున్న బన్నీ, సీనియర్ హీరోయిన్ టబు, నా స్నేహితురాలు పూజా హెగ్డే, పీఎస్ వినోద్, తమన్ వంటి వారితో కలిసి పనిచేస్తుండడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ‘చిలసౌ’ తర్వాత నేను చేస్తున్న ఈ సినిమా నాకు మరో సాహసం లాంటిది. ఈ చిత్రబృందం నుంచి నేనెంతో నేర్చుకోగలనని నమ్ముతున్నా” అంటూ సుశాంత్ ట్వీట్ చేశాడు.
previous post