BREAKING NEWS:
surveys on 2019 election forecasting

ప్రాంతీయ కూటమిదే విజయం అంటున్న సర్వేలు…

20

ప్రస్తుత దేశ రాజకీయాలను చూస్తుంటే మోడీ ప్రభుత్వానికి దాదాపుగా వ్యతిరేక పవనాలే వీస్తున్నాయి. 2019లో మోడీ విజయం సాధ్యమనేట్టు ఏ సర్వే నివేదిక లేదని ఇటీవలే లోక్ నీతి-సి.ఎస్.డి.ఎస్-ఏబీపీ మూడ్ అఫ్ ది నేషన్ సర్వే నిర్వహించి అదే విషయాన్నీ స్పష్టం చేసింది. అయితే భారతీయ జనతా పార్టీ ఓడిపోటానికి కారణాలు కూడా స్పష్టం చేసింది ఈ సర్వే.

అవేంటో చూద్దాం :
ప్రస్తుత వ్యతిరేక పవనాలతో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా అన్ పాపులర్ అయిపోయింది. ఎన్నికలకు ముందు ఇలాంటి పరిస్థితులలో ఉండటం ఖచ్చితంగా మంచిది కాదనేది ప్రాథమిక విషయం.

హిందుత్వాన్ని ముఖ్యంగా తీసుకువచ్చే ప్రభుత్వం అని పేరుండటంతో మిగిలిన వారు ఈ ప్రభుత్వంతో కొంత అసంతృప్తితో ఉన్నారని తేటతెల్లం అయిపోతుంది, అలాంటి వర్గాలకు చెందిన ముస్లిమ్స్, సిక్కులు, క్రిస్టియన్స్ ప్రభుత్వం పై పూర్తిగా వ్యతిరేకంగానే ఉన్నారని చెప్పొచ్చు, అలాగని హిందువులు అందరు బీజేపీకి మద్దతు ఇస్తున్నారా అంటే అలాంటి పరిస్థితులు కూడా కనిపించడంలేదు, హిందువులు విడిపోయి అధికార పార్టీ, ప్రతిపక్షాలలో దేనికి మద్దతు ఇస్తారనేది కాస్త కఠినమైన సమస్యనే అవుతుందని ఈ సర్వేలో వెల్లడవుతుంది.

గత కొన్ని నెలలలోనే బీజేపీ తన ప్రభుత్వ ప్రతిష్టను 7 శాతం కోల్పోయింది, ఇది ఇలాగే కొనసాగితే మాత్రం అంటే ఈ అన్ పాపులారిటీ 30 శాతానికి గాని చేరితే ఖచ్చితంగా మళ్ళీ విజయం సాదిస్తుందని చెప్పలేకపోవచ్చు. కొన్ని నెలలలో బీజేపీ తనపై వస్తున్న దుష్ప్రచారాన్ని తగిన రీతిలో అడ్డుకోకుంటే ఫలితాలు వేరేలనే ఉండనున్నాయి.

surveys on 2019 election forecasting

ప్రస్తుత పరిస్థితులలో కాంగ్రెస్ 25 శాతం ఓట్లను అంటే నలుగురిలో ఒకరు ఓటు వేసే అవకాశం ఉంది, ఇది మొత్తం కలిపి 31 శాతం ఓట్లను సాదించగలదు. దేశవ్యాప్తంగా ఈ శాతం ఉండనుంది. అయితే కాంగ్రెస్ కు ప్రస్తుతం ఉన్న ప్రాంతీయ పార్టీల మద్దతు కూడా కడితే ఈ ఓట్ల శాతం మరో 11 వరకు పెరిగే అవకాశం ఉంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో బీజేపీ గెలుపు అంత సులభం అయితే కాదని తేలిపోతుంది.

బీజేపీ గెలవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను ఎన్నికలలోపు సరిదిద్దుకోవాల్సి ఉంది, అలా లేని పరిస్థితులలో ప్రాంతీయ పార్టీలతో కూడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ఈ సర్వే తేల్చింది.

ఇటీవల జరిగిన ఉపఎన్నికలు సాక్ష్యంగా ఉండనున్నాయి ఈ సారి ఎన్నికలకు. అదేవిధంగా గనక పరిస్థితులు ఎదురైతే మళ్ళీ బీజేపీ రావటం కష్టమే అంటుంది సర్వే.

surveys on 2019 election forecasting

ఒకపక్క రాహుల్ గాంధీ తనను విమర్శించే వారి ప్రశంసలు పొందుతున్నారు, మరో పక్క మోడీ తన అభిమానులను మెల్లిమెల్లిగా కోల్పోతున్నారు. ప్రస్తుతం మోడీ ప్రభుత్వంలో బయటపడ్డ నిర్వవ్ మోడీ స్కాం…తదితర విషయాలు మోడీ ప్రభుత్వం 60 శాతం లంచాలతో స్కాములతో నిండిపోయిందని అభిప్రాయంతో 50 శాతం వరకు వారి నిర్ణయంపై ఆలోచనలో ఉన్నారు, ఇది కొంచం అటూఇటూ అయినా ఫలితాలు తారుమారు కాకతప్పదు.

ఒక్క ఉత్తర భారతంలో తప్ప మోడీ దేశంలోని అన్ని ప్రాంతాలలో తన ప్రాతినిధ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. మరో పక్క రాహుల్ తన స్థానాన్ని పదిలం చేసుకుంటూ వస్తున్నారు. మోడీని బాగా దెబ్బతీసిన విషయాలలో అతి పెద్దదిగా జి.ఎస్.టి ని చెప్పుకోవచ్చు, దీనితో బీజేపీ పై 24 శాతం వ్యతిరేకత కాస్తా 40 శాతానికి పెరిగిపోయింది. ప్రస్తుతానికైతే మోడీకి ఒక్క అనుకూల పవనం కూడా లేదని చెప్పవచ్చు.

ప్రాంతీయ కూటమితో బీజేపీని మట్టి కరిపించాలని చూస్తున్న రాహుల్ వ్యూహం ఫలించినా తాను మాత్రం ప్రధాని అవుతాడా, లేదా అనేది కూడా పెద్ద ప్రశ్న గానే ఉండనుంది.

Source : Quint.com