రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ఆయన అరెస్ట్ ను వైసీపీ సమర్థిస్తుంటే.. విపక్షాలు మాత్రం మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. ఎంపీ రఘురామ కృష్ణరాజుకు బెయిల్ మంజూరు అయింది. రఘురామ కృష్ణరాజుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్టు. బెయిల్ పై బయటకి వెళ్ళాక.. విచారణకు సహకరించాలని రఘురామ కృష్ణరాజుకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. అలాగే విచారణకు 24 గంటల ముందే నోటీసులు ఇవ్వాలని పేర్కొంది. అలాగే రఘురామ కృష్ణరాజును న్యాయవాదుల సమక్షంలోనే విచారించాలని సుప్రీం కోర్టు తెలిపింది. ఈ కేసుపై మీడియాలో మాట్లాడకూడదని రఘురామకు ఆదేశాలు జారీ చేసింది సుప్రీం కోర్టు. విచారణలో రఘురామ జోక్యము చేసుకోకూడదన్న సుప్రీం కోర్టు.. లక్ష రూపాయలు చొప్పన ఇద్దరు పది రోజుల్లోపు పూచీ కత్తు, 10 రోజుల్లోపు చెల్లించాలని రఘురామకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడితే సీరియస్ గా పరిగణిస్తామనన్న రఘురామను హెచ్చరించింది సుప్రీం కోర్టు.
previous post