దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా రూపొందుతోన్న భారీ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’. ఈ చిత్రంలో ఇప్పటికే తారక్, చరణ్‌లతో పాటు అజయ్ దేవగణ్, ఆలియాభట్ వంటి బాలీవుడ్ తారలు, ఒలివియో మోరిస్, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడీ వంటి హాలీవుడ్ తారలు నటిస్తోన్న ఈ చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కూడా నటిస్తున్నారట. తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలో మోహన్‌లాల్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తోన్న ఎన్టీఆర్‌కి బాబాయ్ పాత్రలో నటిస్తున్నారని సమాచారం. మరి ఈ వార్తలపై ఆర్ఆర్ఆర్ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 8న చేయబోతున్నారు.
previous post