super lotto lottery won 180 million dollars

లాటరీలో 180 మిలియన్ డాలర్లు….

95

సూపర్‌ లోట్టో జాక్‌పాట్‌లో ఎన్ గ్రే అనే జమైకన్ మహిళ 180 మిలియన్‌ జమైకన్‌ డాలర్లు మన కరెన్సీలో 9కోట్ల రూపాయలకు పైగా గెలుచుకుంది. మే 11న తీసిన డ్రాలో ఎన్ గ్రే విజేతగా నిలిచింది, అయితే ఆ మహిళ నిర్వాహకులనుంచి చెక్కును తీసుకోవడానికి వచ్చినప్పుడు తనను గుర్తుపట్టి గెలిచిన డబ్బును దొంగిలిస్తారనే భయమో,లేక ఇంకేదో భయంతో మోకానికి మనం చాటింగ్ లో వాడే ఎమోజీ ఎమోజి మాస్క్‌ని ధరించి మీడియా ముందుకు వచ్చిన విషయాన్ని నిర్వహణ సంస్థ అయిన సుప్రీమ్ వెంచర్స్ లిమిటెడ్ ట్విట్టర్ లో పెట్టగా, పెట్టిన కాసేపటికే ఏకంగా 3000 లైకులు, పలు కామెంట్లు వచ్చాయి.

అయితే ఎన్ గ్రేకు లాటరీలో కోట్లు గెలవడం ఎంతో సంతోషం కలిగించవచ్చు, రాత్రికి రాత్రే కోటీశ్వరుల జాబితాలో చేరడం అంటే మాములు మాట కాదు కదా! అయితే ఆమెకు ఎం భయం పెట్టుకుందో ఏమో కానీ తననెవరూ గుర్తుపట్టకూడదని ఆమె చేసిన పని ట్విట్టర్ లో ట్రెండయింది. పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ఎన్ గ్రే కు ఇంత పెద్ద మొత్తం లాటరీ రూపంలో రావడం ఎంతో సంతోషాన్నిచిందట, ఈ డబ్బుతో తన అప్పులన్నీ కట్టేయొచ్చని ఆనందం తో ఉబ్బేతిపోయింది. అప్పు తీర్చడమే కాదు కొంత సొత్తును పెట్టుబడి రూపంలో పెట్టి వ్యాపారం చేస్తానని, మరికొంత డబ్బును తానుండే ప్రాంత యువతకోసం కమ్యూనిటీ శిక్షణ కార్యాలయం స్థాపించి, ఆసక్తి ఉన్న వారికీ అందులో శిక్షణ ఇప్పిస్తానని చెప్పుకొచ్చింది.