సుదీర్ఘకాలం అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎట్టకేలకు భూమిపైకి చేరుకున్నారు.
స్పేస్ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ విజయవంతంగా ప్రయోగించబడిన తర్వాత, నాసా క్రూ-9 వ్యోమగాములు సునీతా విలియమ్స్, నిక్ హేగ్, బుచ్ విల్మోర్, రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ భూమిపైకి చేరుకున్నారు.
వ్యోమగాములను స్ట్రెచర్లపై క్యాప్సూల్ నుండి బయటకు తీశారు. సునీత విలియమ్స్ ఈ 45 రోజులు నాసా సెంటర్లోనే ఉంటారు.
వారిని వైద్యులు, మానసిక నిపుణుల పర్యవేక్షణలో ఉంచుతారు. రోజుకు రెండు గంటల చొప్పున ఈ 45 రోజుల పాటు వివిధ వ్యాయామాలు చేయిస్తారు.
అనుక్షణం వారిని మానిటరింగ్ చేస్తారు అధికారులు. శరీర సామర్థ్యం, కండరాల, ఎముకల బలం పెపొందించడం కోసం వ్యాయామాలు చేయిస్తారు.
దాదాపు 9నెలల తర్వాత భూమ్మీదకు వచ్చారు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్. వీరికి ఎన్నోరకాల శారీరక, మానసిక ఇబ్బందులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఇన్నాళ్లు చట్టాల కళ్లు కప్పారు… ఇకపై అలాంటివి సాగవు: విజయసాయి రెడ్డి