telugu navyamedia
క్రీడలు వార్తలు

సంజు పై గవాస్కర్ ఫైర్…

ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు నాయకత్వాన్ని వహిస్తున్నాడు సంజు శాంసన్. క్రికెట్‌లో పెద్దగా అనుభవం లేనప్పటికీ.. అతనిపై ఎక్కడా లేని విశ్వాసాన్ని ఉంచింది ఆ టీమ్ మేనేజ్‌మెంట్. కానీ సంజు కేప్టెన్సీలో కొనసాగుతోన్న రాజస్థాన్ రాయల్స్.. ఇప్పటిదాకా ఒకే ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి దిగజారింది. దాంతో సంజు శాంసన్.. విమర్శలకు కేంద్రబిందువు అవుతున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ తరువాత.. ఆడిన మూడింటిని కలిపి అతను చేసిన వ్యక్తిగత స్కోర్ 26 పరుగులు. ఇది అతని బ్యాటింగ్ నిలకడ లేమిని సూచిస్తోందని టీమిండియా మాజీ కేప్టెన్, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ విమర్శించారు. అతని నిలకడలేమి తనం వల్లే టీమిండియాలో చోటు దక్కించుకోలేకపోతున్నాడని మండిపడ్డారు. తాను ఎలా అవుట్ కావాలో.. అతనికి తెలిసినంత బాగా మరెవరికీ తెలియదని ఎద్దేవా చేశారు. అవుట్ కావడానికి మార్గాలను సంజు శాంసన్ వెతుక్కున్నాడని చురకలు అంటించారు. క్రికెట్ షాట్లకు దూరంగా అతని బ్యాటింగ్ శైలి ఉంటోందని వ్యాఖ్యానించారు. అతని బ్యాటింగ్ మళ్లీ గాడిన పడాలంటే.. సరైన క్రికెట్ షాట్లను ఆడాల్సి ఉంటుందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో అది అసాధ్యమని తనకు అనిపిస్తోందని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.

Related posts