telugu navyamedia
తెలంగాణ వార్తలు

తరుణ్ చుగ్‌ స్థానంలో సునీల్ బన్సాల్ : బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీగా నియామ‌కం

*పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకం
*తరుణ్‌ ఛుగ్‌ స్థానంలో బాధ్యతలు
*తెలంగాణతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ కూడా..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుండటం బీజేపీని మరింత పటిష్టం చేసేందుకు గాను పావులు పార్టీ అధిష్టానం పావులు క‌దుపుతోంది. ఈ నేప‌థ్యంలో బీజేపీ తెలంగాణ ఇంచార్జీగా పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సునీల్ బ‌న్స‌ల్‌ను నియ‌మించింది.

ఈ మేర‌కు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా బుధ‌వారం సాయంత్రం అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేశారు. రాజస్థాన్ కు చెందని సునీల్ బన్సల్ ఉత్తర్ ప్రదేశ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు

ప్రస్తుతం ఉన్న ఇన్ ఛార్జి తరుణ్‌ చుగ్ స్థానంలో సునీల్ బన్సల్ ను కేంద్ర నాయకత్వం నియమించింది. అంతేకాకుండా ఆయ‌న‌కు తెలంగాణ పార్టీ శాఖ ఇంచార్జీ బాధ్య‌త‌ల‌తో పాటుగా ప‌శ్చిమ బెంగాల్‌, ఒడిశా శాఖ‌ల ఇంచార్జీగానూ నియ‌మించారు. 

కాగా..తరుణ్ చుగ్ ను తప్పించడంపై పార్టీలో చర్చ జరుగుతుంది. మునుగోడు ఉప ఎన్నిక జరుగుతున్న సందర్భంలో ఆయనను తప్పించి సునీల్ బన్సల్ ను నియమించడం వెనక అనేక కారణాలున్నాయని తెలిసింది. పశ్చిమ బెంగాల్, ఒడిశాలో పార్టీని బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. ఉత్తర్‌ప్రదేశ్ లో బీజేపీ రెండుసార్లు అధికారంలోకి రావడానికి సునీల్ బన్సల్ కారణమని భావించి తెలంగాణ ఇన్ ఛార్జిగా అధినాయకత్వం నియమించింది.

Related posts