telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

భారీ ధరకు “వకీల్ సాబ్” శాటిలైట్ రైట్స్

Vakeel-Saab

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ రూపొందుతోంది. ఈ సినిమాను దిల్ రాజు, బోని కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవన్‌ సరసన శ్రుతీ హాసన్ నటిస్తోంది. నివేథా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీపై పవన్‌ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. హిందీలో హిట్టయిన ‘పింక్’ సినిమా ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ‘వకీల్ సాబ్’ శాటిలైట్ హక్కులను భారీ ధరకు సన్ నెట్‌వర్క్ కొనుగోలు చేసిందట. అంటే జెమిని టీవీలో ‘వకీల్ సాబ్’ దర్శనమిస్తాడన్నమాట. లాక్‌డౌన్ కారణంగా సుమారు ఆరు నెలలు ఆగిపోయిన ‘వకీల్ సాబ్’ షూటింగ్ అక్టోబర్ నెలలోనే మొదలైంది. అయితే, పవన్ కళ్యాణ్ లేకుండా మిగిలిన ఆర్టిస్టులపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. త్వరలోనే పవన్ కళ్యాణ్ కూడా షూటింగ్‌లో పాల్గొంటారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. దీని కోసం పవన్ కళ్యాణ్ 20 రోజుల కాల్షీట్లు కేటాయించారట. ఈ 20 రోజుల్లో పవన్ కళ్యాణ్ పోర్షన్ మొత్తం పూర్తయిపోతుందని అంటున్నారు. అంతేకాదు త్వరలోనే టీజర్‌తో ఫ్యాన్స్‌ను పవన్ సర్‌ప్రైజ్ చేయనున్నారని తెలుస్తోంది.

Related posts