telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రౌడీగా వస్తున్న సుమంత్‌

సుమంత్ ప్రస్తుతం భారీ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. చివరిగా ఎన్టీఆర్ బయోపిక్‌లో అక్కినేని నాగేశ్వరరావుగా నటించిన సుమంత్ ప్రస్తుతం ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో ‘కపటధారి’ అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా చిత్ర టైటిల్ పోస్టర్‌, మోషన్ పోస్టర్‌ను కింగ్ నాగార్జున విడుదల చేశారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ సినిమా విడుదల కాకముందే సుమంత్ మరో సినిమా తెరకెక్కిస్తున్నారు. అంతేకాకుండా తన తాజా చిత్రం నుంచి ఫస్ట్‌లుక్‌ను కూడా రిలీజ్ చేశారు. ‘అనగనగా ఒక రౌడీ’ అనే క్యాచీ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో వాల్తేరు శ్రీను పాత్రలో సుమంత్ కనిపించనున్నారు. విడుదలైన ఫస్ట్ లుక్ చేస్తుందటే ఇందులో సుమంత్ పక్కా మాస్ యాంగిల్‌తో దుమ్మురేపనున్నట్లు అర్థం అవుతోంది. ఈ సినిమాను మను దర్శకత్వంలో ఏక్ దో తీన్ ప్రొడక్షన్ పతాకంపై గార్లపాటి రమేష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మరి ఈ సినిమాతో సుమంత్ మరో భారీ హిట్ అందుకుంటారని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.

Related posts