తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డిపై చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శలు గుప్పించారు. మంత్రి కేటీఆర్‌పై రేవంత్‌రెడ్డి చేసిన తప్పుడు ఆరోపణలను ఖండించారు. రేవంత్‌రెడ్డి తీరు దొంగే దొంగ అని అరుస్తున్నట్లుగా ఉందని విమర్శించారు. ఆయన ఈ రోజు ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, భానుప్రసాద్, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, సైదిరెడ్డితో కలిసి తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.
గోపన్‌పల్లిలో రేవంత్ రెడ్డి దళితుల భూములు కబ్జా చేశాడని బాల్క సుమన్ ఆరోపించారు. వట్టినాగులపల్లిలోని సర్వే నంబర్ 66లో రేవంత్‌రెడ్డి అక్రమ కట్టడాల వివరాలను బయటపెట్టామని,. కేటీఆర్ ఆస్తుల వివరాలన్నీ పబ్లిక్ డొమైన్‌లోనే ఉన్నాయని చెప్పారు. రేవంత్‌రెడ్డి అక్రమ భాగోతాలన్నీ రానున్న రోజుల్లో బయటపెడతామని అన్నారు.